Daily Pujas

Ishta Kameswari Mata Puja

Supreme Godess Sri Jaganmata graces all, who with undeterred devotion pray her, with endless boons. Bhagavathi extremely likes the prayers that were offered (with Red coloured cloths and Red flowers) to her at the “Rahu” kalam (राहु काल).

Offer half a kilo of black sesame seeds over a couple of Plantain / Banana leaves (or Vistaraakulu) to Bhagavathi, along with 5 litres of sesame seed oil (to lighten lamps for 15 days), 9 pradakshinas and with devotion surrender  your utmost desires at her lotus feet, She blesses you with endless happiness.

Those ladies, who every Friday, lighten 9 Ghee lamps, offer sugar rice (chakkara pongal) as naivedhyam to Bhagavathi along with offering turmeric, kumkum, a jacket piece, fresh coconut & fruits to 3 Muttaiduvas, can attain Mangalya balam.

At this Sri Maha Meru Puram, Bhagavathi radiates with Icha Sakthi, Kriya Sakthi & Gnana Sakthi  and this is a Sakthi Peetham.

జగన్మాత భక్తుల కోర్కెలను ఈడేర్చే కల్పతరువు. ఈ మాత భక్త వరప్రదాయిని. భక్తి కలిగి, మాతను ఆశ్రయించినట్లయితే, నిస్సంశయంగా కోరిన కోర్కెలీడేరుతుంది. మాతకు రాహు కాలంలో చేసేటువంటి పూజ అతి ప్రీతికరము. అమ్మవారికి ఎర్రటి వస్త్రము,ఎర్రటి పుష్పములు, అత్యంత ప్రీతికరము. ఈ అమ్మవారికి రెండు విస్తరాకులలో ఒక అరకిలో నల్ల నువ్వులు పోసి దానిపై తాంబూలం దక్షిణ సమర్పించి అమ్మవారికి దీపము 15 దినములు వెలిగించడానికి గాను సుమారు 5 లీటర్లు నువ్వుల నూనెను సమర్పించి, అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేసి మనసులోని కోరికలను తల్లి పాదార విందములపై సమర్పించినట్లయితే తల్లి తప్పక మన మనవిని ఆలకించి అనుగ్రహిస్తుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి 9 నెయ్యి దీపములు వెలిగించి చెక్కరపొంగలి నైవేద్యం పెట్టి 3 ముత్తైదువులకు పసుపు, కుంకుమ, రవిక బట్ట, టెంకాయి, పండ్లు యిచ్చి అమ్మవారిని ప్రార్థించినట్లయితే స్త్రీలకు మాంగల్య బలం చేకూరుతుంది. ఈ క్షేత్రము శక్తి పీఠము. ఇచ్చట ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ప్రజ్వరిల్లుతూ ఉంటుంది.

Govu Puja (गो पूज)

Those who offer food (green grass, vegetables, jaggery, rice, cotton seeds, fodder, pulses, etc) and pray offering dhup and harathi, to the Sacred Cow (Gow) that is embodiment of all Devine Forms (Devathas), get rid of their karma doshams due to which human beings suffer and are prone to losses.

Doing Pradakshinas to the Sacred Cow at Sri Maha Meru Temple frees one off their Karma Doshams and Gow Santhi presents them with happiness and success in their materialistic deeds.

ఈ దివ్య క్షేత్రంలో సకలదేవతా స్వరూపమైన గోమాతకు భక్ష్యము(అనగా భోజనము, పచ్చగడ్డి, కాయకూరలు, బెల్లము, బియ్యము, ప్రత్తిగింజలు, తౌడు, పప్పుదినుసులు, మొదలగునవి) సమర్పించి, ధూప, దీపములచే పూజించి నమస్కరించినట్లయితే ప్రారబ్ధ కర్మ దోష పరిహారం కలుగుతుంది. ప్రారబ్ధ కర్మ దోషం వలననే మానవుడు అనేక కష్ట నష్టముల పాల్పడుతూ ఉంటారు. గోప్రదక్షిణ కర్మదోష నివారణ. గోశాంతి సుఖ,శాంతులను చేకూరుస్తుంది.